మల్హర్ ఆర్ఎంపీ, పీఎంపీ నూతన అడ్హాక్ కమిటీ ఎన్నిక
కన్వీనర్ గా చొప్పరి రాజయ్య
జిల్లా కమిటీ ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు
మల్హర్, సెప్టెంబర్ 13(చక్రవాణి న్యూస్) : తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మల్హర్ మండల అధ్యక్షుడు కుక్కడపు అశోక్ అధ్యక్షతన ఆదివారం మండల కేంద్రమైన తాడిచర్లలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, సంయుక్త కార్యదర్శి ముడుతనపల్లి ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మండల కమిటీ పదవీకాలం ముగియడంతో జిల్లా కమిటీ ఆదేశాల మేరకు నూతన అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అడ్హాక్ కమిటీ కన్వీనర్‌గా చొప్పరి రాజయ్య, కో-కన్వీనర్‌గా దేనవేన సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా జంగిడి సమ్మయ్య, కోట నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతన మండల కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకు అడ్హాక్ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. నూతన మండల అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారిలో గతంలో మండల అధ్యక్షుడిగా పనిచేసిన వారు అనర్హులుగా పరిగణించబడతారని పేర్కొన్నారు.నూతన మండల కమిటీ ఎన్నికను త్వరలోనే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ గ్రామీణ వైద్యులు వొన్న తిరుపతిరావు, లింగన్నపేట శ్రీధర్, బాపురావు, బండి సుధాకర్,తాటికొండ కేశవ్, అజిత్, అజిమ్, చంద్రయ్య, శంకర్, రాజు నాయక్, సంపత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Tag:




No comments: